Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడితే కవులు, రచయితలు సహించబోరని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భజలాల పరిరక్షణకోసం హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగు నీటి శుద్ధి సంస్థ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 300 మంది కవుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా తెలంగాణ దాహార్తి తీర్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ నేలమీద పడ్డ ప్రతినీటి బొట్టును వొడిసి పట్టి కోటి ఎకరాల మాగాణం చేసి తెలంగాణను దేశానికి ఆకలితీర్చే ధాన్యాగారంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఒకనాడు జలాల కోసం పోరాడిన కవులు, రచయితలు నేడు జల సంరక్షణలో కూడా తమవంతు చారిత్రక పాత్రను పోషిస్తారని చెప్పారు.