Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో ప్రొఫెసర్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల వల్ల సమాజంలో గొప్ప మార్పు వచ్చిందని ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మీడియా అకాడమీ, షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని జెఎన్టీయూ ఫైన్ ఆర్స్ కాలేజీలో దళిత జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉన్నదని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించటం దేశంలోనే చారిత్రక విషయమని చెప్పారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ జ్ఞానం కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధించింది కాదన్నారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శినాగుపల్లి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.