Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దత్తాత్రేయ, చంద్రబాబు రాక
నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి-హైదరాబాద్
మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు రాసిన 'నేను-తెలుగుదేశం' పుస్తకావిష్కరణ సోమవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న దస్పల్లా హోటల్లో జరగనుంది. దీనికి ముఖ్యఅథితులుగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. రామ్మోహన్రావు 40 ఏండ్ల వ్యక్తిగత, రాజకీయ జీవితం, ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసమస్యలపై పోరాటాల గురించి కంభంపాటి రాశారు. అలిపిరి ఘటన, రాష్ట్ర విభజన తదితర అంశాలనూ పుస్తకంలో పొందుపరిచినట్టు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.