Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్-పుదుచ్చేరి మధ్య విమాన సర్వీసు ఆదివారం ప్రారంభమైంది. అందులో రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రయాణించారు. హైదరాబాద్-పుదుచ్చేరి మధ్య విమాన సర్వీసులు ప్రారంభించే విషయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తూ తమిళిసై ప్రత్యేక చొరవతీసుకున్నారు. సర్వీసు ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రధాని మోడీ, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమాన సర్వీస్ ప్రారంభం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సంబంధా లు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో రన్ వే పొడవు పెంపు విషయంలో తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన భూమిని సేకరించేందుకు చొరవతీసు కుంటానని తెలిపారు. అక్కడి అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శిం చటానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడతారనీ, అలాగే హైదరాబాద్ బిర్యానీ రుచి కోసం, పుదుచ్చేరి ప్రజలు ఇక్కడకు వస్తారని గవర్నర్ పేర్కొన్నారు.