Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కృష్ణా జలాల పరి రక్షణ కోసం మరో యాత్ర చేయనున్నట్టు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉదతం చేస్తామని చెప్పారు. సోమవారం టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటూ ఓట్ల కోసం బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు. అందుకే తాము కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో రైతు రక్షణ యాత్ర చేస్తున్నామని తెలిపారు.నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకేంద్రం సామాన్యులకు భారంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజేఎస్ పార్టీ కార్యవర్గాన్ని కోదండరామ్ ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షులు పీ.ఎల్.విశ్వేశ్వర్ రావు, సయ్యద్ బద్రోద్దీన్, గంగపురం వెంకట్ రెడ్డి, రాజా మల్లయ్యతో పాటు ప్రధాన కార్యదర్శులుగా ఏడుగురు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా నలుగురు, సంయుక్త కార్యదర్శిగా ఒకరు, అధికార ప్రతినిధులు ఇద్దరితో పాటు మహిళా తదితర విభాగాల బాధ్యుల పేర్లను ప్రకటించారు.