Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చట్టసభల్లో బీసీ బిల్లుతో పాటు వారికి 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరపతలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని రాష్ట్రాల నుండి బీసీలు పెద్దఎత్తున తరలివచ్చి, జయప్రదం చేయాలని కోరారు. ధర్నాకు పలు పార్టీల నేతలను ఆహ్వానించారు. మహాధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కష్ణయ్య హాజరుకానున్నారని తెలిపారు. బీసీల పట్ల వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న కేంద్రంతో ఎంత వరకైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 30న బీసీ ఎంపీలతో సమావేశం, 31న పెద్దసంఖ్యలో బీసీలతో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామన్నారు.