Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ఎన్ఎల్ ధర్నాలో సాంబశివరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం '4జీ' కొనుగోళ్లలో ప్రయివేటు, ప్రభుత్వం కంపెనీల మధ్య వివక్ష చూపకూడదని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సర్కిల్ కార్యదర్శి జి.సాంబశివరావు చెప్పారు. '5జీ' సర్వీసులకు సకాలంలో అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు,రంగాలవారీ ఫెడరేషన్ల ఐక్యవేదిక పిలుపుమేరకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ టవర్లను, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను ప్రయివేట్ కంపెనీలకు అద్దెకు ఇవ్వకూడదని కోరారు. ఉద్యోగులకు మూడోవ వేతన సవరణ అమలు చేయాలనీ, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలనీ, వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సుశీల్‌కుమార్, ఏఐబీడీపీఏ (పెన్షనర్ల అసొసియేషన్) సర్కిల్ కార్యదర్శి రాంచంద్రుడు, నాయకులు శేషయ్య, రంగరాజన్, నర్సింగరావు తదితరులు ప్రసంగించినారు.