Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాద్రాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ
- కేసీఆర్ దంపతుల పూజలు
- కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రులు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులను సోమవారం గర్భాలయంలోకి చేర్చడంతో యాద్రాద్రి ఆలయ ప్రారంభ ముఖ్య ఘట్టం సోమవారం ముగిసింది. నవ్య యాద్రాద్రిని సీఎం కేసీఆర్ జాతికి
పునరంకితం చేశారు. స్యయంభువుకు మొదటి మహానివేదన, తీర్థ ప్రసాదగోష్ఠి వేద పండితులు సమర్పించారు. బాలాలయంలో నిత్యహోమాలు, చటుస్థానార్చనలు, పరివారశాంతి ప్రాయశ్చిత్త హోమం, బలిహరణం, మహాపూర్ణాహుతి, కుంబడిద్వాసన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయంలో గర్తన్యాసం, యంత్ర, బింబప్రతిష్ఠ, అష్టబంధనం, కళారోహణం, ప్రాణప్రతిష్ఠ, నేక్రోన్మీలనం, దృష్టికుంభం కార్యక్రమాలు చేపట్టారు.
కేసీఆర్ పూజలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మహా వేద ఆశీర్వచనం పలికారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా స్వయంభువుకు కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్య విమాన గోపురంపై బంగారు సుదర్శన చక్రం వద్ద నిర్ణయించిన ముహూర్తానికే 11.55 గంటలకు మహా కుంభ సంప్రోక్షణ పూజల్లో సీఎం దంపతులు, ఎంపీ సంతోష్‌రావు, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. పవిత్ర నదీ జలాలతో సప్త గోపురాలపై కలశాలకు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గుంతకండ్ల జగదీష్‌రెడ్డి సతిసమేతంగా మంగళవాయిద్యాలతో వేద మంత్రాల మధ్య జలాభిషేకం గావించారు. స్వయంభూ ఆలయంలో నిత్యారాధనల అనంతరం శాంతి కళ్యాణం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉపప్రధానా ర్చకులు, అరకబృందం, పారాయణీకులు ఈ మహౌత్సవంలో పాల్గొని పారాయణీలు, ఆచార్య రుత్విక్ సన్మానం, మహదాశీర్వచనం ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, ఉద్యోగసిబ్బంది, సందర్శకులు పాల్గొనగా పరిసమాప్తి గావించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్ రావు, ఆలయ ఇన్చార్జి ఈవో గీత, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహ మూర్తి, అర్కిటెక్ట్ ఆనంద సాయి, స్టపతి సుందర్ రాజన్, ఆర్కిటెక్ మధుసూదన్ స్థపతి ఆనందచారీ వేలులకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు సన్మానించారు.