Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరించండి
- సీఎం కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న అన్నదాతలను వేధించడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి కరెంటు కోతలు విధించడం, ఎరువుల ధరలు పెంచడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు గందరగోళంలో ఉన్నారనీ, ఇప్పుడే చేతికొస్తున్న పంటకు నీరందించకుండా విద్యుత్ కోతలు విధించడం సరికాదని చెప్పారు. పట్టణ ప్రాంతాలకు 24 గంటలు విద్యుత్ ఇస్తూ...వ్యవసాయానికి కరెంటు కోత విధించడమేంటని ప్రశ్నించారు. అవసరమైతే పట్టణ ప్రాంతాల్లో రెండు గంటలు కోత విధించి రైతాంగానికి మేలు చేయాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు వారీ విద్యుత్ వినియోగం 35 మిలియన్ యూనిట్లు నమోదుకాగా, 5 మిలియన్ యూనిట్ల కోత విధించారని పేర్కొన్నారు. రైతులకు 24గంటల విద్యుత్ అలవాటు చేసి ఇప్పుడు కోతలు విధించడమేంటని ప్రశ్నించారు. ఒకవైపు ఎరువుల ధరలు పెంచుతూ, విద్యుత్ కోతలు విధిస్తూ, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు.