Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీరుమారని ఇంటర్ బోర్డు : టిగ్లా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్‌కు సంబంధించి జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) ఏర్పాటులో సీనియార్టీని పక్కనపెట్టి ఇంటర్ బోర్డు అధికారులు దళారీ కోటరీ పెద్దపీట వేస్తున్నారని తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్ల సంఘం (టిగ్లా) విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణగౌడ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీఈసీలో సీనియర్ అధ్యాపకులకు అవకాశమివ్వకుండా డీఐఈవోలు, నోడల్ అధికారులు, బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారనీ, అవకతవకలకు ప్పాలుడుతు న్నారని తెలిపారు. కొంతమంది అధికారులు అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు అధికారుల తీరుమారడం లేదని వెల్లడించారు. సీనియార్టీని పాటించకుండా ఉద్యోగులు, అధ్యాపకులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.