Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాయువ్య జిల్లాలపై ఎక్కువ ప్రభావం
- గరిష్ట ఉష్ణోగ్రలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం
- చాప్రాలలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి, రెండు తేదీల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందనీ, వాయువ్య జిల్లాలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండ తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఇంటీరియల్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాల్లో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే ఐదు రోజులకు గానూ ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం అసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల,యాదాద్రిభువనగిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
మంగళవారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
చాప్రాల్(ఆదిలాబాద్) 43.3 డిగ్రీలు
ఆదిలాబాద్ అర్బన్ 43.2 డిగ్రీలు
కెరమెరి
(కొమ్రంభీం అసిఫాబాద్) 43.1 డిగ్రీలు
బోరజ్(ఆదిలాబాద్) 43.1 డిగ్రీలు
మద్దుట్ల(జగిత్యాల) 43.0 డిగ్రీలు
సిరికొండ (నిజామాబాద్) 42.9 డిగ్రీలు
మల్లాపూర్(జగిత్యాల) 42.9 డిగ్రీలు
కొత్తపల్లి(వనపర్తి) 42.9 డిగ్రీలు
లక్మాపూర్(నిజామాబాద్) 42.8 డిగ్రీలు
ఎండపల్లి(జగిత్యాల) 42.8 డిగ్రీలు