Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మాసాల్లో రూ.80,710 కోట్లు జారీ :ఎస్ఎల్బీసీ
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ ముగింపు నాటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని బ్యాంక్‌లు ప్రాధాన్యత రంగాలకు రూ.80,710 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలం రుణాల జారీతో పోల్చితే 55.91 శాతం వృద్థి చోటు చేసుకుంది. బుధవారం హైదరాబాద్‌లో స్టేట్ లేవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్,ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ అమిత్ జింగ్రన్ 2021డిసెంబర్ త్రైమాసికానికి బ్యాంక్‌ల ప్రగతికి సంబంధించిన సమీక్షను ప్రవేశపెట్టారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ, హౌజింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ సెక్రటరీ రోనల్డ్ రాస్, ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ కె నిఖిల, ఎస్ఎల్బిసి కన్వీనర్ క్రిషన్ శర్మ, అన్ని బ్యాంక్‌లు ప్రతినిధులు హాజరై మాట్లాడారు.ఎస్ఎల్బీసీీ రిపోర్ట్ ప్రకారం.. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం రుణాల జారీ 3.81శాతం పెరిగి రూ.25,889 కోట్లకు చేరాయి. వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.11,709 కోట్లుగా నమోదయ్యాయి. విద్యా రుణాల కింద రూ.610 కోట్లు, గృహ రుణాల కింద రూ.3,259 కోట్ల అప్పులు మంజూరయ్యాయి. ఎస్ఎంఈల రుణాలు ఏడాదికేడా దితో పోల్చితే 81.83 శాతం పెరిగి రూ.32,210 కోట్లకు చేరాయి. 2021 డిసెంబర్ ముగింపు నాటికి మొత్తం డిపాజిట్లు రూ.6,03,548 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో అడ్వాన్సులు రూ.7,06,123 కోట్లుగా చోటు చేసుకున్నాయి.