Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళులు
- ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిం చారు. హైదరా బాద్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు న్యూఆదర్శ్నగర్లో జెండా ఎగురవేశారు. దీనికి రెండు రాష్ట్రాల అధ్యక్షులు బక్కిన నర్సింహులు, అచ్ఛెన్నాయుడుతో పాటు నందమూరి బాలకృష్ణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వర్ల రామయ్య, అర్వింద్కుమార్గౌడ్, కంభంపాటి రామ్మోహన్రావు, తెలుగుమహిళ అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న తదితరులు హాజరయ్యారు. జెండావిష్కరణ తర్వాత చంద్రబాబుతో సహా పార్టీ నేతలంతా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్భవన్లో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ 1982 మార్చి 29న టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. 40 ఏండ్ల క్రితం కొద్దిమందితో మీటింగ్ పెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షించే ఎన్టీఆర్ పార్టీ పెట్టారనీ, ఆయన పెట్టిన పార్టీ చరిత్ర సృష్టించింది..ఎప్పటికైనా తెలుగుజాతి, టీడీపీ కంటే ముందు, తర్వాత అని లిఖించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల సంక్షేమం, అభివృద్ధేగాక ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, ప్రపంచానికి చాటిచెప్పింది ఎన్టీఆర్. 40 సంవత్సరాల్లో ఎన్నో చరిత్రలు సృష్టించాం,ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాం, మరోసారి తెలుగుజాతి పునరంకితం కావాల్సిన అవసరముంది. అందుకే పార్టీ స్థాపించిన ఈ ప్రదేశానికి వచ్చాం. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినా వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారు ఉన్నంతకాలం టీడీపీ ఉంటుందనీ, తెలుగుజాతిని, తెలుగుదేశం పార్టీని ఎవరూ విడదీయలేరని వ్యాఖ్యానించారు. ఏపీ టీడీపీ అద్యక్షులు అచ్ఛెన్నాయుడు మాట్లాడుతూ ఏపీలో తెలుగుదేశం అభివృద్ధికి శక్తివంచనలేకుండా పనిచేస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వ ఆగడాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళుతున్నామని వివరించారు. తెలంగాణ అధ్యక్షులు బక్కిన నర్సింహులు మాట్లాడుతూ తాను పశువుల కాపరిగానైనా ఉంటాను గానీ, టీడీపీని మాత్రం వీడనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను అందమైన, ఆనందనగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ప్రజాస్వామికవాదుల్లో చంద్రబాబు అగ్రగణ్యులని అభిప్రాయపడ్డారు. ఆవిర్భావ దినోత్సవానికి రెండు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత భారీగా తరలివచ్చారు.