Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్‌గ్రాడ్ లక్ష్యం : ఫాల్గుణ్ కొంపల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో నాణ్యమైన గ్లోబల్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా అప్‌గ్రాడ్ ముందుకు వెళ్తున్నట్టు ఆ సంస్థ సహవ్యవస్థాపకులు ఫాల్గుణ్ కొంపల్లి తెలిపారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్లో ఆన్లైన్లో కొత్త ప్రోగ్రామ్‌ను అందిస్తున్నదని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే 24 నెలల్లో వందకుపైగా ఆన్లైన్ ప్రోగ్రామ్‌లను జోడించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని వివరించారు. మే నుంచి ప్రారంభమయ్యే ఐదు నెలల ఆన్లైన్ ప్రోగ్రామ్, ప్రపంచస్థాయి వార్టన్ ఫ్యాకల్టీ ఇండిస్టీ లీడర్లతో ప్రత్యక్ష రికార్డు చేయబడిన ఉపన్యాసాల రూపంలో ఉంటుందని తెలిపారు. బలమైన నాయకత్వ నైపుణ్యం అనేది నిపుణులు వారి కెరీర్లో ముందుకుసాగడానికి సహాయపడే ఇంజిన్ అని వార్డన్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ వైస్ డీన్ జగ్మోహన్ రాజు తెలిపారు. 2024 నాటికి 7.5 మిలియన్ నమోదిత వినియోగదార్లను సాధించాలని లక్ష్యంగా ఉందని వివరించారు.