Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మత్స్యకార సొసైటీలు, సభ్యులకు ప్రస్తుత లీజు ధరలే కొనసాగుతాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని మత్స్యభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రస్తుతం ఉన్న లీజు ధరలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. జీవో 268 ద్వారా పంచాయితీ రాజ్ శాఖకు చెందిన చెరువులలో చేపల పెంపకం, వేటపై యాజమాన్య హక్కులను మత్స్యశాఖకు బదలాయిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని తెలిపారు. శాశ్వతంగా నీరు నిల్వ ఉండే ఒక హెక్టార్‌కు రూ 400లు, ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటే హెక్టార్‌కు రూ 200లు, తక్కువ కాలం పాటు నీరు నిల్వ ఉంటే హెక్టార్‌కు 60లు చొప్పున లీజు వసూలు చేస్తున్నామనీ, ఇప్పుడు కూడా అదే లీజు మొత్తాన్ని వసూలు చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను మంత్రి ఆదేశించారు.