Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టే విధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదే విషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుకుంటే కేంద్రం అడ్డుపడకుండా కిషన్రెడ్డి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లో ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ సభ్యులు మంత్రి సత్యవతి రాథోడ్ని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.