Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్, మౌలిక వసతుల అభివద్ధి కంపెనీ ఏఆర్కె గ్రూప్ నుంచి హైదరాబాద్ బాచుపల్లిలో అత్యంత విలాసవంతమైన, చిన్నారులకు ఇష్టమైన రీతిలో, సకల సదుపాయాలతో ఏఆర్కె సంయక్ను ప్రారంభించినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ జీ రామిరెడ్డి, సీఈఓ శ్రీమతి మేఘన గుమ్మి తెలిపారు. బుధవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బాచుపల్లి హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న సబ్ అర్బన్ ప్రాంతమనీ, పాఠశాలలు, మాల్స్, హాస్పిటల్స్ ఇతర నిత్యావసర సేవలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తాము వ్యూహాత్మకంగానే ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడ నిర్మించినట్టు వివరించారు. నాలుగంతస్తుల క్లబ్ హౌస్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్, నీటి సామర్థ్యం కలిగిన ప్లంబింగ్ ఫిక్చర్స్ వంటి మౌలిక వసతుల సదుపాయాలన్నీ దీనిలో ఉన్నాయని తెలిపారు.