Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి
నవతెలంగాణ-ఉప్పల్
యాదాద్రి దర్శనానికి ఉప్పల్ నుంచి యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ ఉప్పల్ రింగ్‌రోడ్‌లో యాదగిరిగుట్టకు వెళ్లే మినీ బస్సులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ గీతా ప్రవీణ్‌తో కలిసి జెండా ఉపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి జిల్లా కేంద్రం నుంచి, ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్టకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. సిటీకి సంబంధించి జూబ్లీ బస్టాండ్ నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సు టికెట్ ధర రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 నిర్ణయిం చినట్టు తెలిపారు. ప్రతి రోజూ 104 సర్వీసులు అందుబాటులో ఉంటా య న్నారు. ఇవే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.