Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నీరా పానీయం 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధగుణాలు కలిగి ఉంటుందని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. గీత వత్తిని, వత్తిదారులను కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో నిర్మిస్తున్న 'నీరా కేఫ్' పనులను రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, ఆబ్కారీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి బుధవారం పరిశీలించారు. మరుగున పడిపోతున్న కుల, చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తేవాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో రూ 25 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నీరా కేఫ్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నీరా ఉత్పత్తికి ప్రాథమికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనం, సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మునిపల్లి, రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం చరికొండ గ్రామంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.