Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మెన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఆత్మీయ అభినందన సమావేశంలో పాలొన్న రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యా రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారనీ, పేద మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.7238 కోట్లతో ''మన ఊరు - మన బడి '' కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు.