Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో భాగంగా వైద్యారోగ్యశాఖలో అర్హత కలిగిన వివరాలతో ప్రతిపాదనలు పంపాలని ఆ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ ఆయా విభాగాల అధిపతులను కోరారు. ఈ మేరకు సర్క్యులర్ ను జారీ చేశారు. అత్యవసరంగా ఈ ప్రతిపాదనలను పంపిం చాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, ఆయూష్ కమిషనర్, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులను ఆదేశించారు.