Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవేశ పరీక్షల్లో బీసీలకు మినహాయింపు ఇవ్వాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్ దరఖాస్తు ఫీజు తగ్గించాలని ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీతో పోల్చితే ఎంసెట్ దరఖాస్తు ఫీజు ఎక్కువగా ఉందని తెలిపారు. ఎస్సీ,ఎస్సీ,వికలాంగులకు దరఖాస్తు ఫీజు రూ.400, ఇతరులకు రూ.800 చెల్లించాలంటూ ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారని పేర్కొన్నారు. ఇది దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఏపీలో ఎస్సీ,ఎస్టీలకు రూ.500, బీసీలకు రూ.550, ఇతరులకు రూ.600 ఉందని తెలిపారు. కానీ రాష్ట్రంలో బీసీ అభ్యర్థులకు ఫీజులో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధికి ఉన్నత విద్యామండలి రూ.పది కోట్లు విరాళంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇవ్వలేరా?అని ప్రశ్నించారు. బీసీ అభ్యర్థులకూ ఫీజులో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.