Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు ఆర్‌యూపీపీటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్-2లో తెలుగు, హిందీ పండితుల కోసం సిలబస్‌ను మార్చాలని ఆర్‌యూపీపీటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితాఇంద్రారెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు కలిసి వినతిపత్రం సమర్పించారు. టెట్ పేపర్-2లో తెలుగు, హిందీ భాషా పండితులు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షలో సోషల్ సైన్స్, గణితం వంటి అంశాలతో సిలబస్ ఉండడం వల్ల భాషాపండితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారికి సంబంధించిన అంశాలనే 60 మార్కులను సిలబస్‌లో ప్రత్యేకంగా చేర్చాలని కోరారు. ఈ అంశాలపై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.