Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌జీహెచ్‌ఎంఏ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావుకు బుధవారం ఈమెయిల్ ద్వారా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం వినతిపత్రం పంపించారు. ట్రెజరీలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పింఛన్ సౌకర్యాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఒకరోజూ గడువుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఉన్న బిల్లులన్నింటినీ ఆమోదించాలని కోరారు.