Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్, టీఎస్ పీజేఏ, హెచ్ యూజే సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పలు మీడియా సంస్థల్లో సుదీర్ఘకాలం పని చేసిన సీనియర్ పాత్రికేయులు హెచ్.వెంకటేష్ (56) మరణించారు. బుధవారం స్వల్ప అస్వస్థతకు గురైన వెంకటేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇంగ్లీష్, తెలుగు మీడియా సంస్థలకు చెందిన పలు టీవీ చానెల్స్, పత్రికల్లో ఆయన పని చేశారు. ప్రస్తుతం ఆయన ఎన్ఎస్ఎస్ అనే న్యూస్ ఏజెన్సీలో సీనియర్ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రాములు, చంద్రమ్మల కుమారుడైన వెంకటేష్‌కు భార్య ఆశాలత, కుమారుడు అదిత్య కుమార్ ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు జర్నలిజం రంగానికి ఆయన సేవలందించారు. గురువారం ఆయన అంత్యక్రియలను వనస్థలిపురంలో నిర్వహించను న్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్, కొప్పు నిరంజన్, తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్, కె.ఎన్.హరితో పాటు పలువురు సీనియర్ పాత్రికేయులు వెంకటేష్ మరణం పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.