Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి : ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్
- నేడు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాల అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ఇఫ్తార్ విందులు, రంజాన్ తోఫాలు మాకొద్దు.. బడ్జెట్, సబ్‌ప్లాన్ చట్టం తేవాలి. బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించి నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలి' అని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కే హాల్లో ముస్లిం మైనార్టీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న తెలంగాణ ముస్లిం మైనార్టీ సంఘాల జాక్ ఆధ్వర్యంలో ఎస్వీకేలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను వెల్లడించి, కార్యాచరణ ప్రకటించారు. ఈ సంవత్సరం రంజాన్ నెలలో ఇఫ్తార్ విందుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.8 కోట్లు, రంజాన్ తోఫాల కోసం రూ. 21 కోట్లు కేటాయించిందని, ఇవి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఉపయోగిపడేవి కావని అన్నారు. ఇఫ్తార్ విందులను, తోఫాలను ముస్లిం సమాజం తిరస్కరించి అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు, ముస్లిం హక్కుల నేత, ఓయూ జాక్ నాయకులు సయ్యద్ సలీంపాషా, తెలంగాణ ఉద్యమకారులు, ముస్లిం రిజర్వేషన్ పోరాట నాయకులు, రచయిత, చమన్ పత్రిక సంపాదకులు యూసుఫ్ షేక్ (స్కైబాబ), జాక్ రాష్ట్ర నాయకురాలు షాహీన్ సుల్తానా మాట్లాడారు.