Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ్యత్వం, బీమా చెక్కు అందజేత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయనను కలిశారు. సభ్యత్వం, బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ధాన్యం కొనుగోళ్లు, నిరుద్యోగం తదితర సమస్యలపై జరగనున్న బహిరంగసభకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్ చివరి వారంలో వస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మనిణ్యిం ఠాగూర్, ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి, డిజిటల్ సభ్యత్వ చీఫ్ కో ఆర్డినేటర్ హర్కర వేణుగోపాల్, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, అజారుద్దీన్, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, ఎన్నికల కమిటీ ఛైర్మెన్ దామోదర రాజానర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, బీమా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు ఆహ్వానం ఉన్నప్పటికీ పాదయాత్ర కొనసాగుతుండటంతో ఆయన హాజరు కాలేదు. ఇదే విషయాన్ని ఆయన అధిష్టానానికి తెలియజేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.