Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి నిమిషంలో చేస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం
- త్వరగా దరఖాస్తు చేసేందుకు అవకాశం
- త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు : టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)ను తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఓటీఆర్ ఉన్న అభ్యర్థులు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాతిపదికన వివరాలను మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటీఆర్ ఐడీ ద్వారా నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఓటీఆర్‌లో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హతలు నమోదు చేయాలని కోరారు. చివరి నిమిషంలో నమోదు చేస్తే సమస్యలు తలెత్తే ప్రమాదముందని వివరించారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నూ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలని సూచించారు. మొబైల్ నెంబర్ నమోదు చేయాలనీ, ఓటీపీ వస్తుందనీ, దాన్ని నమోదు చేయాలని వివరించారు. దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈమెయిల్ ఐడీ, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు నమోదు చేయాలని తెలిపారు. అభ్యర్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాలనీ, ఈవివరాలన్నీ సమర్పించిన తర్వాత టీఎస్పీఎస్సీ ఐడీ వస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు జనరేట్ అయ్యే పీడీఎఫ్ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ సమర్పించడానికి ముందే లాగ్అవుట్ అయితే మళ్లీ మొదటి నుంచి ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వెబ్సైట్లో ఎడిట్ ఓటీఆర్‌పై క్లిక్ చేయాలని వివరించారు. టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసిన తర్వాత ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందనీ, దాన్ని నమోదు చేయాలని సూచించారు. ఎడిట్ చేయాల్సిన వివరాలను సవరించడంతోపాటు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలతోపాటు విద్యార్హతలను నమోదు చేయాలని తెలిపారు. అభ్యర్థి ఫొటో, సంతకం అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేసిన తర్వాత కొత్త ఓటీఆర్ పీడీఎఫ్ పత్రాన్ని జనరేట్ అవుతుందనీ, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.