Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 83 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల పనులు పూర్తిచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 344 కి.మీ. మేర మౌలిక సదుపాయాలను తన నెట్వర్క్ పరిధిలో జోడిరచి, రికార్డు నెలకొల్పినట్టు పేర్కొన్నారు.197 కి.మీ. డబుల్ రైల్వే లైన్లు, 64 కి.మీ మూడవ రైల్వే లైన్లు జోన్ పరిధిలో పూర్తి చేసినట్టు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో 2021-22లో జోన్ రైల్వే నెట్వర్క్కు అదనంగా 344 ట్రాక్ కి.మీ మేర మౌలిక సదుపాయాలను జోడిరచి నూతన శిఖరాలను అధిరోహించిందని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని నిర్దేశిత సమయంలోగా వేగంగా పూర్తి చేయడానికి కచ్చితమైన ప్రణాళికలు వేసుకుందని సమర్థవం తంగా అమలు చేయడంతో ఈ అద్భుతమైన విజయాన్ని సాధించగలిగిందని తెలిపారు. రికారును సాధించటంలో విశేష పనితీరును కనబర్చిన జోనల్, డివిజినల్ స్థాయిలోని మొత్తం రైల్వే సిబ్బందితో పాటు నిర్మాణ విభాగం, ఆర్విఎన్ఎల్, రైట్స్ సంస్థ (ఆర్ఐటిఈఎస్) అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.