Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు విద్యుత్ ఛార్జీలను పెంచవద్దని తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ (టీఎస్ఎఫ్ సీసీటీ) అధ్యక్షులు అమ్మనబోలు ప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్న వ్యాపారులు గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. చాలా మంది తమ షాపులను మూసేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయనీ, విద్యుత్ ఛార్జీలు పెంచితే వారి పరిస్థితి ఘోరంగా మారిపోతుందని తెలిపారు.