Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణి ఉన్నతిలో అధికారులు కె.రవిశంకర్, కె.సురేందర్ అందించిన సేవలు చిరస్మరణీయమని ఆ సంస్థ జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ కొనియాడారు. గురువారం హైదరాబాద్లో కె.రవిశంకర్, కె.సురేందర్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారితో పాటు బొగ్గు మంత్రిత్వశాఖ సంచాలకుడిగా వెళ్తున్న మారెపల్లి వెంకటేశ్వర్లుకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ నిజాయితీ, అనుభవం కలిగిన అధికారుల లోటు సంస్థకు పూడ్చలేనిదని అన్నారు. మారెపల్లి వెంకటేశ్వర్లు బొగ్గు మంత్రిత్వశాఖలో డైరెక్టర్ పోస్టుకు ఎంపిక కావడం సింగరేణీయులందరికి గర్వకారణమన్నారు.