Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహణ
- పాఠశాలలకు చివరి పనిదినం ఏప్రిల్ 23
- టైంటేబుల్లో విద్యాశాఖ సవరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-2) పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సంచాలకులు ఎం రాధారెడ్డి గురువారం సవరించిన పరీక్షల టైంటేబుల్‌ను విడుదల చేశారు. తొలుత ఈనెల ఏడు నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఒక్కరోజులోనే టైంటేబుల్‌ను సవరించి విడుదల చేయడం గమనార్హం. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 23న ఫలితాలు ప్రకటిస్తామనీ, తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం నిర్వహిస్తామని వివరించారు. డీఈవోలు ఎస్ఏ-2 పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు చివరి పనిదినం ఏప్రిల్ 23 అని స్పష్టం చేశారు. అయితే వేసవి సెలవుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈనెల 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులుంటాయని అకడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు. ఇంకోవైపు పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు జరుగుతాయి.