Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిజం వత్తినే శ్వాసగా మార్చుకొని మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని కొనసాగించిన హకీంపేట వెంకటేష్‌కు పలువురు పెద్దలు కన్నీటి వీడ్కోలు పలికారు. పలు ఇంగ్లిష్,తెలుగు పత్రికల్లో వివిధ హౌదాల్లో పనిచేసిన వెంకటేష్ బుధవారం నాడు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ శివారు వనస్థలిపురం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ముగిసాయి. అంతకు ముందు ఆయన భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రి పీఆర్వో రమేష్ హజారే ,టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి, తెలంగాణ వర్కిగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అధ్యక్షులు మామిడి సోమయ్య సహా పలువురు జర్నలిస్టులు వెంకటేష్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సీనియర్ జర్నలిస్టు కే శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన ్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, సీనియర్ జర్నలిస్టులు వెలిజాల చంద్రశేఖర్, సీఎన్ఎన్ న్యూస్ 18 వెబ్ పత్రిక న్యూస్ ఎడిటర్ వెంకటరమణ, ఎన్ఎసెస్ మేనేజర్ శ్రీధర్‌రావు, ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఎడిటర్ ఎం.లక్ష్మయ్య, బీజినెస్ డైరీ ఎడిటర్ కేఎల్.నరసింహరావు. కేఆర్.కే శర్మ, ఈ చంద్రశేఖర్, బొమ్మగాని కిరణ్‌కుమార్, జాన్రాస్, గందె గోవర్ధన్, రాజశేఖర్, దుర్గం శ్రీనివాస్ తదితరులు ఆయనకు ఘనమైన నివాళిని అర్పించారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి పీఆర్వో రమేష్ హజారే దహన సంస్కారాల నిమిత్తం రూ. 10,000ను వెంకటేష్ బార్య, కుమారునికి అందజేశారు.