Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉగాదిని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఉగాది రోజున ప్రయాణీకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా మరో మూడు రాయితీలు కల్పించనున్నట్టు ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీ.సీ.సజ్జనార్ తెలిపారు. 65 ఏండ్లు పైబడిన వారు ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చనీ, వయస్సును ధవీకరించే పత్రం ఏదైనా చూపించాల్సి ఉంటుందన్నారు. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు 5 కిలోల బరువున్న పార్శిళ్ల బుకింగ్ ఛార్జీల పై 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు వారు వెల్లడించారు. ఆ రోజుల్లో ఎంత దూరానికైనా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. విమానాశ్రయానికి వెళ్లే పుష్ఫక్ బస్సులో అప్ అండ్ డౌన్ టిక్కెట్‌పై తిరుగు ప్రయాణంలో 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణాన్ని 10 రోజుల్లోపు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.