Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన
నవతెలంగాణ-కంఠేశ్వర్
మంచినీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ(ఎం) నగర కార్యవర్గ సభ్యురాలు సుజాత డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ కాలనీవాసులు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మంచినీటి సరఫరా కోసం ఒక వ్యక్తిని కేటాయించాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే మరింత ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో శారద, శ్రీదేవి, రుక్సానా, ముంతాజ్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.