Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ)లోని బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20లోపు కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని ప్రగతి శీల కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ఎల్పద్మ, అరుణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ పద్దతుల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయటానికి ప్రభుత్వం జీవో విడుదల చేసిందనీ, దీనిని కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 2006 నుంచి పనిచేస్తున్న మహిళా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బంది పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విడనాడాలని విజ్ఞప్తి చేశారు.