Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కొత్త పింఛన్లను వెంటనే ఇవ్వాలనీ, దానికి అవసరమైన నిధులను కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 57 ఏండ్లు నిండిన అర్హులైన దాదాపు 11 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. 2018లో సర్కార్ ఇచ్చిన హామీ అమలైతే ఒక్కో ఆసరా పింఛన్ లబ్దిదారులకి ప్రభుత్వం ఇఫ్పటి వరకు రూ.78,624 వచ్చేవని గుర్తుచేశారు. ఈ మేరకు బకాయిపడ్డ రూ.78,624లను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల నుంచి అమలు చేస్తామని ఆర్భాటపు ప్రచారం చేసి కనీసం కసరత్తు చేయకపోవడం దుర్మార్గ మన్నారు. దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన మార్గదర్శకాలను సైతం విడుదల చేయకపోవడం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రఘునందన్‌రావును బేషరతుగా విడుదల చేయాలి : బండి
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అరెస్టు చేయడం దారుణమనీ, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సిద్దిపేట సీపీకి ఫోన్‌చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న వారికి రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు.