Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేసిన బీజేపీ ఎంపీపై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆప్ సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ, అతని అనుచరులు పట్టపగలు ఒక సీఎం ఇంటిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేస్తుంటే, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీ పోలీసులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ...బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. దేశ భక్తి అంటే దేశాన్ని, ప్రజలను ప్రేమించడమేననీ, బీజేపీ మాత్రం దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య విద్వేషాలను సష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు దేశభక్తి ముసుగులో అరాచకాలు సష్టిస్తూ అభివద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు. దమ్ముంటే కేజ్రీవాల్ నమూనా అభివద్ధికి బీజేపీ ప్రభుత్వాలు ముందుకు రావాలని సవాల్ విసిరారు. గూండాలను, విద్రోహశక్తులను పెంచి పోషిస్తున్న బీజేపీకి ప్రజలే తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెర్చ్ కమిటీ సభ్యులు బుర్ర రాములుగౌడ్, సుధాకర్, మాజిద్, సలావుద్దీన్, జానీ తదితర నాయకులు పాల్గొన్నారు.