Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుండగులను కఠినంగా శిక్షించాలి :కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులకు కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎ స్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం ఇరికిచెడులో గిరిజనుల ముసుగులో పెత్తం దారుల కుట్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని తెలి పారు.ఘటనకు కారణమైన అగ్రకులస్తు లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పోలీస్ పికేటింగ్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.