Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నాలుగు రోజుల్లో పెరుగనున్న ఉష్ణోగ్రతలు
- చాప్రాల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
- దాదాపు అన్ని జిల్లాల్లోనూ 42 డిగ్రీలు దాటిన వైనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అదే సమయంలో శుక్ర, శని వారాల్లో ఉత్తర, వాయువ్య తెలంగాణ జిల్లాలు(ఆదిలాబాద్,కొమ్రంభీమ్, మంచిర్యా ల,నిజామాబాద్,నిర్మల్, జగిత్యాల) వడగా ల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా చాప్రాల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటిపోయాయి. 31 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.ఉష్ణోగ్రతలు,ఉక్కపోతలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం పూట వీలైనంత మేరకు ఇండ్ల నుంచి బయటకు రావొద్దనీ, వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
చాప్రాల్(ఆదిలాబాద్) 43.8
కెరమెరి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 43.8
ఆదిలాబాద్ అర్బన్ 43.7
వాంకిడి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 43.7
జైనధ్(ఆదిలాబాద్) 43.6
లింగాపూర్(నిర్మల్) 43.3
కుంతాల(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 43.3
మద్దుట్ల(జగిత్యాల) 43.2