Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ''మోటూరి ఉదయం''
- ఐద్వా ఉపాధ్యక్షులు టి జ్యోతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా ఉద్యమ దిక్చూచి మోటూరి ఉదయం అని అఖిల భారత మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జ్యోతి తెలిపారు. గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మోటూరి ఉదయం వర్థంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ తొలితరం మహిళా ఉద్యమ నాయకురాలు మోటూరి ఉదయం అని చెప్పారు. బుర్రకథలతో ప్రజల్లో చైతన్యం రగిలించారని గుర్తుచేశారు.ఆమే తన జీవితాంతం మహిళా హక్కుల కోసం ఉద్యమించిన వీరవనిత అని చెప్పారు. ఆడవాళ్లపై హింసకు పాల్పడేవారికి ఉదయం పేరు చెబితే భయం పుట్టేదని తెలిపారు. ఆమె ధైర్యానికి మారని చెప్పారు.ఆడపిల్లల రక్షణకు కరాటే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేవారని చెప్పారు.ఆమె స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో పనిచేయాల్సిన అవశ్యకత నేటి పరిస్థితుల్లో పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఆశాలత, ఇందిర, స్వర్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.