Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వానసంఘం సన్నాహాక సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్
నవతెలంగాణ - భువనగిరి
మే 4,5,6 తేదీల్లో యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర 3వమహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ కోరారు. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆహ్వాన సంఘం సన్నాహాక సమావేశం గురువారం జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దయ్యాల నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీఎంపీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గొర్రెల మేకల పెంపకందారుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. ఆ పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం జారీచేసిన 1016, 559 జీవోలతో.. ప్రభుత్వ భూములపై, తుమ్మ చెట్టు మండపైన, చెరువుల్లో తుమ్మ చెట్లను కొట్టుకునే హక్కు లభించిందన్నారు. పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి గొర్రెల కాపరులకు సబ్సిడీపై రుణాలు అందజేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి సంఘం జీఎంపీఎస్ అన్నారు. గొర్రెల పంపిణీలో అవినీతి జరగకుండా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు కిల్లే గోపాల్, రాష్ట్ర అధ్యక్షులు రావుల జంగయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయ్యాల నరసింహ, మద్దెపురం రాజు, జిల్లా గౌరవాధ్యక్షులు బండారు నరసింహ, గౌరవ సలహాదారు కల్లూరి మల్లేశం, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.