Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలా భానుపై గురువారం రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ ఆదేశాలు పాటించకుండా జిల్లాలోని 24 మత్స్యశాఖ సంఘాల ద్వారా 640 మందిని సభ్యత్వ నమోదు చేశారు. ఉన్నతాధికారులు సమాచారం లేకుండా నమోదు చేసి సభ్యుల వద్ద నుంచి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేయడంతో జిల్లాలోని కొంత మంది సభ్యులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ జరిపి ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు అక్రమాలకు పాల్పడి అక్రమంగా అర్హులు కాని వారికి జిల్లాలో అడ్డగోలుగా సభ్యత్వాలు ఇచ్చారనే కారణంతో సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.