Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెరవేరిన బోధన్ పట్టణవాసుల కల
నవతెలంగాణ-బోధన్
నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బోధన్ వరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విద్యుత్ రైలు ట్రయల్ రన్‌ను గురువారం నిర్వహించారు. అధికారులు ఆ రైలులో ప్రయాణించారు. ఎట్టకేలకు బోధన్ పట్టణవాసుల కల నెరవేరింది.
ఏడాదికిపైగా ఆదాయం లేదంటూ రైల్వేశాఖ అధికారులు బోధన్ పట్టణానికి నడుస్తున్న ప్యాసింజర్ రైలును రద్దు చేశారు. దాంతో సమీప ప్రాంతాల ప్రయాణికులు నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లడానికి ప్రయాస పడాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధుల విన్నపాలతో, విద్యార్థి సంఘాల ఉద్యమంతో రైల్వే అధికారులు బోధన్ వరకు ఎలక్ట్రికల్ రైలు నడిపేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పనులను త్వరితగతిన పూర్తి చేసి బోధన్ వరకు ఎలక్ట్రిక్ రైలు ట్రయల్ రన్ చేపట్టారు. అలాగే, నిజామాబాద్ నుంచి బోధన్ వరకు పూర్తయిన ఎలక్ట్రిక్ రైల్వే లైన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం.శరత్చంద్ర మాట్లాడుతూ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ రైళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయని చెప్పారు. నిజామాబాద్ నుంచి బోధన్ వరకు సుమారు 26 కిలోమీటర్ల విద్యుత్ ఫికేషన్ నెలలో పూర్తి చేశామని తెలిపారు. సంవత్సరంలో హైదరాబాద్ నుంచి బోధన్ వరకు పూర్తి చేస్తామన్నారు. నిజామాబాద్, మోర్తాడ్ కరీంనగర్ లైన్ పూర్తయిందని, వచ్చే నెలలో మహబూబ్‌నగర్ వరకు రైలు నడిపే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ చీఫ్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ అభరు కుమార్రారు, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.