Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంతటి కాశన్న, రాజు
- నాగర్కర్నూల్, గద్వాల జిల్లాల్లో నిరసనలు
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి / కందనూలు
గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కుచేడు గ్రామంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ నాగర్కర్నూల్ అధ్యక్షులు అంతటి కాశన్న, గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట, గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించాలని, భయబ్రాంతులకు గురైన దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ గ్రామాన్ని సందర్శించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలోని అగ్ర సామాజిక తరగతులకు చెందిన వారు 8 ఏండ్లుగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారని తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకున్నా కావాలనే పెత్తందార్లు రాజకీయం చేస్తున్నారని చెప్పారు. అలాగే దళిత బంధు పథకం విషయంలో రాజకీయ జోక్యం లేకుండా ఈ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిం చాలని, అప్పుడే దళితులకు న్యాయం చేకూరుతుం దన్నారు. అనంతరం కేటీ దొడ్డి మండల కేంద్రంలో తహసీల్దార్ సుందర్రాజుకు వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పరంజ్యోతి, నాగర్కర్నూల్ జిల్లా ఉపాధ్య క్షులు నందిపేట భాస్కర్, వ్యకాస రాష్ట్ర నాయకులు కవిత, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.