Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రఘునందన్‌రావును అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
నవతెలంగాణ-తొగుట/ మిరుదొడ్డి/ బెజ్జంకి
సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో గురువారం జరిగిన కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం రణరంగాన్ని తలపించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారీతిన ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డీ విరుస్తున్నదని టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేను అడ్డుకోగా.. బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే..
గుడికందుల గ్రామంలో రూ.12.50 లక్షల వ్యయంతో నూతనంగా మార్కెట్ షెడ్లు నిర్మించారు. వాటి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు గురువారం వస్తున్నారని తెలిసి.. టీఆర్ఎస్ శ్రేణులు పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఖాళీ గ్యాస్ బుడ్లను అడ్డుపెట్టి నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు. కాగా బీజేపీ నాయకులు సైతం 'జై బీజేపీ, భారత్ మాతాకి జై' అంటూ ఎదురెదురుగా నినాదాలు చేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పోలీసులు ఇరువురికి సర్ది చెప్పడంతో మార్కెట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సభను ప్రారంభించగా.. పీఏసీఎస్ చైర్మెన్ హరికృష్ణారెడ్డి, ఎంపీటీసీ కవిత నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజల నడ్డీ విరుస్తున్నదని ఆరోపించారు. మరోపక్క మార్కెట్‌ను నిర్మించిన కాంట్రాక్టర్‌ను ఎందుకు పిలువలేదని కాంట్రాక్టర్ కొడుకు నిరసన తెలిపాడు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. పీఏసీఎస్ చైర్మెన్ మరోమారు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలు తిరిగి నినాదాలు మొదలెట్టడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.
మిరుదొడ్డి స్టేషన్లో ఎమ్మెల్యే నిరసన.. అరెస్టు
గుడికందులలో జరిగిన విషయమై ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎస్ఐ లేకపోవడంతో.. అక్కడే నిరసన తెలిపారు. మార్కెట్ ప్రారంభోత్సవ సమ యంలో పోలీసులు టీఆర్ఎస్ శ్రేణులకు అనుకూలంగా వ్యవహరిం చారని, అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారారని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజె ప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి బెజ్జంకి స్టేషన్‌కు తరలించారు.