Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మియాపూర్‌లో భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలన్న బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు వేసిన పిల్‌పై హైకోర్టు విచారణకు తెరదించింది. 2017 నాటి మియాపూర్ భూముల కుంభకోణంలో పలువురు ప్రముఖులు ఉన్నారనే పిల్‌ను శుక్రవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తే అందులోని నిందితులు కొందరు హైకోర్టులో కేసు వేశారని, పోలీసుల కేసును హైకోర్టు కొట్టేస్తూ తీర్పు చెప్పిందని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జీవో ఇచ్చినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ వివరాలతో హైకోర్టు సంతప్తి చెంది సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది.