Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింహపురి ఎనర్జీ లిమిటెడ్ సంస్థను రూ.800 కోట్లకు వన్‌టైం సెటిల్మెంట్ కింద కొనుగోలు చేసేందుకు మధుకాన్ ఇన్ఫ్రా, షేర్హౌల్డర్లు సిద్దంగా ఉన్నా ఎస్బీఐ బ్యాంకు నేతత్వంలోని కన్సార్టియం అంగీకరించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రూ.800 కోట్ల కంటే తక్కువ రేటుకు ఆ సంస్థను విక్రయించడానికి వీల్లేదని జస్టిస్ డాక్టర్ జి.రాధారాణి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. సింహపురి ఎనర్జీలో తమకు 80 శాతానికిపైగా షేర్లు ఉన్నాయని, ఈ కంపెనీని వన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.800 కోట్లకు కొనుగోలు చేసేందుకు షేర్హౌల్డర్లు సంసిద్దత వ్యక్తం చేసినా ఎస్బీఐ అంగీకరించడం లేదని మధుకాన్ ఇన్ఫ్రా సంస్థ రిట్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.