Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థులందరు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఉపకారవేతనాల దరఖాస్తు గడువును పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఏడాది ఉపకారవేతనాల కోసం ఆఖరి గడువు మార్చి 31తో ముగిసింది. అయితే వైద్య విద్యార్థులకు సంబంధించి నీట్ ఆల్ ఇండియా ర్యాంకుకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఈ-పాస్‌కు రాకపోవడం వల్ల వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందిగా మారింది. అదే విధంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజా సమాచారాన్ని ఇవ్వలేదు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 3,500 మంది విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించేందుకు అర్హత పొందారు. ఇంకా మాపప్ రౌండ్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప విశ్వవిద్యాలయం పూర్తి సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. స్టే వేకెన్సీలో సీట్లు వచ్చిన వారూ ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారితో పాటు వివిధ కోర్సుల్లో ఉపకారవేతనాలను రెన్యూవల్ చేసుకోవాల్సిన విద్యార్థులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్కాలర్‌షిప్పుల దరఖాస్తు గడువును పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.