Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెత్తందారుల దిష్టిబొమ్మ దహనం
- నిందితులను కఠినంగా శిక్షించాలి: కేవీపీఎస్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెత్తందార్లు కుట్రపూరితంగానే అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టారని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద పెత్తందార్ల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇరుకుచేడులో పెత్తందారుల కుట్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమక్షంలో ఘటన జరగటం బాధాకరమన్నారు. స్థానిక దళితులకు రక్షణ కల్పిచాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి సామరస్యవాతావరణం నెలకొల్పాలని కోరారు. ఎనిమిదేండ్లుగా విగ్రహ అవిష్కరణకు ఆటంకం కల్పిస్తున్న పెత్తందారులపై చర్యలు తీసుకోనందున్నే ఈ ఘటన జరిగిందన్నారు. విగ్రహం ఏర్పాటుకు గ్రామపంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ ఉద్దే శపూర్వకంగానే దీన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షులు ఎ విజరు కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, బుడగజంగాల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కడమంచి రాంబాబు, కేవీపీఎస్ నగర ఉపాధ్య క్షులు ఎం దశరద్ నగర అధ్యక్షులు టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.